Oct 02,2023 15:48

స్టాకహేోం :   అమెరికాకు చెందిన కాటిలన్‌ కరికో, డ్రూవెయిస్‌మన్‌లకు వైద్య శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి వరించింది.   స్వీడన్‌లోని స్టాకహేోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ కమిటీ  సోమవారం ఈ బహుమతిని  ప్రకటించింది.  కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు  సమర్థవంతమైన ఫైజర్‌, బయోటెక్‌, మోడర్నా వ్యాక్సిన్‌ల తయారీకి కీలకమైన ఎంఆర్‌ఎన్‌ఎ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు వారిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రకటించింది.  గతేడాది మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ స్వాంటె పాబో ఈ అవార్డును స్వీకరించిన సంగతి తెలిసిందే.