వంటల్లో కరివేపాకును వేయడం వల్ల వంటల రుచి, వాసన పెరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని మనకు తెలుసు. అయితే ఈ కరివేపాకును వంటల్లో వేయడానికి బదులుగా కరివేపాకు నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
తయారీ ఇలా : కొన్ని తాజా కరివేపాకులను తీసుకొని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని మరిగించి వడకట్టి తాగాలి. ఇలా కరివేపాకు నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
- శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది.
- శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
- గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
- కరివేపాకు నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
- అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రేగు కదలికలు చురుకుగా ఉంటాయి.
- ఒత్తిడి తగ్గుతుంది. కండరాలకు, నరాలకు విశ్రాంతి లభిస్తుంది. వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయి.