ప్రజాశక్తి- నందిగామ : నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ను కాపు సంఘం నాయకులు కలిసి ఆదివారం నందిగామ పల్లగిరి భద్రయ్య తోటలో జరిగే కాపు వన సమరాధనకు ఆహ్వనించారు. కాపు సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆదివారం నాడు పల్లగిరి రోడ్ భద్రయ్య తోటలో జరగనున్న కాపు సంఘ వన సమారాధన మహోత్సవానికి విచ్చేయవలసినదిగా ఆహ్వాన పత్రికను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి అందజేశారు.నందిగామ కాపు సంఘం నాయకులు సూర సత్యనారాయణ,గుడివాడ సాంబశివరావు, పారుపల్లి హరిబాబు,ఆకుల వెంకట్రావు , రమేష్ తదితరులు పాల్గొన్నారు.










