
ప్రజాశక్తి-వన్‌టౌన్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో ఎనిమిదో రోజు దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో యాత్రికులకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివస్తున్నారు. దీంతో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భధ్రత ఏర్పాట్లు చేశారు.