
- తక్షణం విధుల్లో చేరాలని ఆదేశం
ప్రజాశక్తి,వన్ టౌన్ : రాష్ట్రంలో రెండవ అతిపెద్ద దేవాలయమైన ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానానికి నూతన కార్యనిర్వాహణాధికారిగా కె .ఎస్. రామారావును ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఈవోగా పనిచేసిన డి.భ్రమరాంబ స్థానంలో గత నాలుగు రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా డి.ఆర్.ఓ గా పనిచేస్తున్న ఎం. శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. అయితే ఆయన్ను విధుల నుండి విడుదల చేయకపోవడం వలన, శ్రీకాళహస్తిలో ఆర్.డి.ఓ గా పనిచేస్తున్న కె.ఎస్ రామారావును ఆదివారం నాడు ప్రభుత్వం ఈవోగా నియమించింది.