Oct 23,2023 18:08

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ : ఇంద్రకీలాద్రిపై దేవిశరన్నవరాత్రి మహౌత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ముగిశాయి. 9 రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన దుర్గమ్మ నేడు చివరిరోజు రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఉదయం 11:30 సమయంలో హౌమశాలలో పూర్ణహుతి నిర్వహించారు. పూర్ణాహుతిలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో కె.యస్‌ రామారావు పాటు పలువురు వేద పండితులు పాల్గొన్నారు.