ప్రజాశక్తి - చిప్పగిరి
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ కలుషితమైన నీటిని తాగవద్దని ఆర్‌డబ్ల్ల్యుఎస్ ఎఇ రామ్ లీలా, ల్యాబ్ కెమిస్ట్రీ రామాంజనేయులు సూచించారు. శుక్రవారం మండల కార్యాలయంలో జల జీవన్ మిషన్ కింద మండలంలో పనిచేస్తున్న లైన్ మెన్లు, వాల్స్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఇ మాట్లాడారు. ప్రతి గ్రామంలోనూ తాగునీటి ట్యాంకులను తప్పనిసరిగా శుభ్రం చేయాలని తెలిపారు. గ్రామాల్లో తాగుతున్న నీటిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మురికి కాలువల దగ్గర ఉన్న తాగునీటి బోరు నీటిన తాగ వద్దని అవగాహన కల్పించాలన్నారు. పరిపాలన అధికారి సుధాకర్ రాజు, పంచాయతీ కార్యదర్శులు సురేంద్ర, సిసింద్రీ, సుజాత, రామాంజనేయులు, నరసింహులు, నరేష్ యాదవ్ పాల్గొన్నారు.