Jul 11,2023 11:36

రోలుగుంట (విశాఖ) : తాగడానికి మంచినీళ్లివ్వండి... అంటూ ... రోలుగుంట మండలంలోని ఫ్లోరైడ్‌ గ్రామ మహిళలు మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ... రోలుగుంట మండల కేంద్రంతోపాటు కొవ్వూరు. నాయుడుపాలెం అంట్లుపాలెం. నిండుగొండ, కొత్తూరు కిలపర్తి పాలెం గొల్లపేట, మునిపెల్లి ఫ్లోరైడ్‌ గ్రామాలుగా ప్రభుత్వం 2007-8 గుర్తించాయి. జానకిరాంపురం వరాహ నది బోరు పంపిన ద్వారా రోలుగుంట కేంద్రంలో రక్షిత మంచినీరు 11 నిమిత్తం లక్ష లీటర్లు ట్యాంక్‌ నిర్మాణం చేశారు. తరచూ మరమ్మతులు అవడంతో... దిక్కు లేక అక్కడి ప్రజలు ఫ్లోరైడ్‌ నీళ్లు తాగవలసి వస్తుంది. 18 వేల మంది జనాభా 9 గ్రామాల ప్రజలు. అనేక ఇబ్బందులు పడుతున్న ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. జగనన్నకు చెపుదాం...కు జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేని పరిస్థితి. నల్లరాయి క్వారీలు కార్యకలాపాల వల్ల దుమ్ము ధూళి తో పాటు. ఫ్లోరైడ్‌ వాటర్‌ తాగడంతో తరచూ అక్కడి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. 25 లక్షలు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణం చేసి ఉత్సవ విగ్రహం లాగా వినియోగంలోకి తీసుకురావడం లేదు. 9 గ్రామాల ప్రజలు అనేకమంది అనేక రోగాలతో బాధపడుతున్నారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌ లో కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ సెంటర్లో ఖాళీలుండటం లేదు. ప్రజలకు ప్రభుత్వం మంచినీరు ఇవ్వడం లేదు. తమకు తాగడానికి మంచి నీళ్ళివ్వాలంటూ.. అక్కడి మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవుడమ్మ, పి.అమ్మోజి, తదితర మహిళలు పాల్గొన్నారు. తక్షణమే మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు డిమాండ్‌ చేశారు.