Apr 02,2023 16:57

ప్రజాశక్తి-రాంబిల్లి(అనకాపల్లి) : ఆదివారం అచ్యుతాపురం సజ్జ రాంబిల్లి మండలంలో ఉన్న కంపెనీల్లో నాన్ ఎస్ ఈజెడ్ రుసిల్ డెకర్స్ పరిశ్రమ కళాసీల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని సిఐటియు నిరసన కార్యక్రమం పరిశ్రమ గేటు వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిశ్రమలో లోడింగ్ అన్లోడింగ్ పనులు నిర్వహిస్తూ పరిశ్రమకు వచ్చే వాహనాలు నుండి మామూలు వసూలు చేసి కార్మికులందరూ పంచుకునే పద్ధతి ఉంది గత నెల రోజుల నుండి పరిశ్రమ యాజమాన్యం వాహనాల యజమానులకు మామూలు ఇవ్వవద్దని బోర్డులు పెట్టి కార్మికులు పొట్ట కొట్టే విధంగా చర్యలు తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా పరిశ్రమ యాజమాన్యానికి పలుమార్లు పాత పద్ధతిలో పనులు కల్పించాలని కార్మికులు కోరినా యాజమాన్యం నేడు రేపు అని వాయిదా లేసి నిన్న ఒకటో తారీకు తేదీలోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీఐఐసీ ,లేబర్ అధికారులు పాత పద్ధతిలో నిర్వాసితులకు కళాసీలకు పనులు కొనసాగించాలని చెప్పిన నేటికీ అమలు చేయలేదు వెంటనే పరిశ్రమ యాజమాన్యం పారిశ్రామిక అశాంతి కలిగించకుండా కార్మికులకు పనులు కల్పించాలని లేదంటే కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాము గొర్లి నాగేశ్వరరావు గొర్లి సత్తిబాబు నానాజీ గుర్రం సూరిబాబు ఏ అప్పలనాయుడు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.