Oct 16,2023 15:50
  • ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం.

ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని కలవచర్లలో కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనకు అవకాశం ఇద్దాం ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రస్తుతం ప్రభుత్వం వలన ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేనకు అవకాశం ఇస్తే కచ్చితంగా సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తామని హమి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, గ్రామ‌ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, ప్రోగ్రామ్ కమిటీ మెంబర్లు, వీరమహిళలు, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.