
న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్ కార్యాలయంపై ఇడి దాడులు, సంస్థ వ్యవస్థాపకులు ప్రబీర్ పురకాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్టుకు వ్యతిరేకంగా వివిధ జర్నలిస్టు సంఘాలు, విద్యార్థులు, యువజన, పౌర సమాజ సంస్థలు బుధవారం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, జంతర్ మంతర్ వద్ద నిరసనలు నిర్వహించాయి.
బిజెపి పాలనలో పత్రికా స్వేచ్ఛపై దాడిని ఈ సందర్భంగా నిరసనకారులు లేవనెత్తారు. బిజెపి ప్రభుత్వం, దాని విధానాలను విమర్శించే జర్నలిస్టులను, ఇతర ప్రగతిశీల మీడియా సంస్థలను ఇడి వేటాడుతోందని విమర్శించారు. క్రూరమైన ఉపా చట్టాన్ని ఉపయోగించి ఢిల్లీ పోలీసులు జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేయడాన్ని వ్యతిరేకించారు. జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. అలాగే న్యూస్ క్లిక్ కార్యాలయానికి సీలు వేయడాన్ని కూడా తీవ్రంగా ఖండించారు.