Jul 29,2023 14:27

ప్రజాశక్తి-నరసాపురం : నరసాపురంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపధ్యంలో పొన్నపల్లి ఏటిగట్టును జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట రామిరెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం పాత నవరసపురంలోని గోదావరి పరివాహక ప్రాంతంను పరిశీలించారు. అక్కడ మెడికల్ క్యాంపు పరిశీలించి అవసరమగు మందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇంకా తహశీల్దార్ ఫాజిల్ పాల్గొన్నారు. యలమంచిలి మండలంలో పెరుగుతున్న గోదావరి ఉధృతి నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, నరసాపూర్ సబ్ కలెక్టర్ సూర్య తేజ దొడ్డి పట్ల, లక్ష్మీపాలెంలలో శనివారం పర్యటించారు. కనకాయలంకతో పాటు లంక గ్రామాల్లో గోదావరి పరిస్థితి పరిశీలించి అవసరమైతే శిబిరాలు నిర్వహిణకు ఏర్పాట్లు చేయాలని కోరారు. మెడికల్, పశు వైద్య శిబిరాల ఏర్పాటును పరిశీలించారు. ఇరిగేషన్ ఇఇతో గోదావరి పరిస్థితిపై చర్చించారు. యలమంచిలి మండలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపధ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట రామిరెడ్డి శనివారం కాజ ఔట్ ఫాల్ స్లూయిజ్ ప్రాంతాన్ని పరిశీలించారు. బాడవ, ఏనుగు వానిలంక పరివాహక గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి స్వయంగా అంచనా వేశారు. మెడికల్, పశువైద్య శిబారాలను పరిశీలించారు. అవసరం అయితే శిబిరాల నిర్వహణ కు ఏర్పాట్లు చేయాలని తహశీల్దార్ ను ఆదేశించారు.