
ప్రజాశక్తి-రాంబిల్లి : రాంబిల్లి మండలం లాలంకోడూరు గ్రామం నుంచి లాలం చందు ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ అయిన సుందరపు విజయ్ కుమార్ అధ్యక్షతన కళాశీల ప్రెసిడెంట్ రుత్తల గణేష్ తో పాటు 200 మంది కలాసీలు కార్యకర్తలు వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీల నుంచి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనపరెడ్డి శ్రీనివాసరావు, అచ్యుతాపురం మండల పార్టీ అధ్యక్షులు బయలుపూడి శ్రీరామదాసు, పవన్ విజయ్, రాంబిల్లి మండల పార్టీ అధ్యక్షులు పప్పల నూకన్న దొర, చోడపల్లి ప్రసాద్, సర్వేశ్వరరావు, రుత్తల శ్రీను, బోలెం రాంబాబు, లాలం గంగాధర్, జాగారపు కేశవ్, లాలం రామారావు, రుత్తల నరేష్ జనసేన నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.