ప్రజాశక్తి-రాంబిల్లి : నేవీ నిర్వాసితులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రాంబిల్లి మండలం, వాడనర్సాపురం వద్ద గల NAOB మెయిన్ గేట్ వద్ద గత 38 రోజులుగా 8 గ్రామాలకు చెందిన NAVY నిర్వాసిత గ్రామాల ప్రజలు అఖిలపక్షంగా ఏర్పడి చేపడుతున్నాయి. ఈ ప్రజా ఉద్యమ శిబిరానికి విచ్చేసిన ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్, సుందరపు విజయ్ కుమార్ అన్నయ్య, జనసేన పార్టీ నాయకులు సుందరపు సతీష్ కుమార్ తమ సొంత నిధుల నుంచి లక్ష రూపాయలు (1,00,000/ ) ను, అఖిలపక్ష JAC నాయకులుకు సతీష్ కుమార్ చేతులు మీదగా విరాళంగా అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యమానికి జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ఇప్పటికే తమ్ముడు సుందరపు విజయ్ కుమార్ తెలియజేయడం జరిగిందన్నారు. ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ..
ఈ ఉద్యమానికి అండగా నిలబడతావని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాంబిల్లి మండల పార్టీ అధ్యక్షులు పప్పల నూకన్నదొర, అలాగే అచ్యుతాపురం మండల అధ్యక్షులు కోరుకొండ ప్రసాద్, జనసేన పార్టీ మత్స్యకార విభాగం జిల్లా నాయకులు చోడిపల్లి అప్పారావు, జనసేన పార్టీ పూడిమడక మెరుగు ప్రవీణ్ కుమార్, పూడిమడక గ్రామ అధ్యక్షులు కారి నూకరాజు, 8 గ్రామాలు కమిటీ పెద్దలు పెద్ద సంఖ్యలో నిర్వాసితులు పాల్గొన్నారు.










