ప్రజాశక్తి-వడ్డాది : శిథిలమైన వడ్డాది వంతెన సమస్య ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి పట్టదా అని జనసేన ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు ప్రశ్నించారు.గురువారం వడ్డాదిలో వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ 48 గంటల నిరవధిక దీక్షకు దిగారు. విశాఖ ఉత్తరం,గాజువాక ఇన్చార్జిలు పసుపులేటి ఉషాకిరణ్, కోన తాతారావు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అంతకుముందు వడ్డాది నాలుగు రోడ్ల కూడలిలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కూడలిలో రాస్తారోకో చేశారు. అక్కడినుండి వంతెన వరకు ర్యాలీగా తరలివచ్చారు.వంతెనను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పందించాలన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే జన సైనికులే ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేసి వంతెన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఏడిద భార్గవ్,గండి దుర్గాప్రసాద్, రాయపరెడ్డి కృష్ణ,జనసైనికులు డిఎస్ నాయుడు, యడ్ల రామ్మూర్తి,దొండా సాయి తదితరులు పాల్గొన్నారు










