
ప్రజాశక్తి-దేవరాపల్లి : మండల కేంద్రంలో మార్చి 18న రాత్రి సమయంలో అనుమానస్పదంగా మృతి చేందిన జామి సింహచలంనాయుడు కుటుంబానికి పోలీసులే తీవ్రమైన అన్యాయం చేసారని పేర్కొన్నారు. గురువారం దేవరాపల్లి మండల కేంద్రంలో మృతుడితల్లి సింహచలమ్మతో ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న, గవిరెడ్డి దేముడునాయుడు, బండారు అప్పలనాయుడు, జామి శ్రీను, చోక్కాకుల దేముళ్ళు, జామిచిన్నం నాయుడు, పాసిల వెంకటరావు పి సతీష్ తదితరులు వీలేకర్లు సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం వారు మాట్లాడారు. జామిసింహచలంనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలని అనుమానితులపై కేసులు పెట్టాలని మృతిడి తల్లి బందువులతో ఏప్రిల్ 14న దేవరాపల్లి పోలీసులు స్టేషన్ ఎదుట నిరాహారదీక్ష చేయడం జరిందన్నారు. దీంతో అనకాపల్లి డిఎస్పీ పోన్లో మాట్లాడి కె కోటపాడు, ఎస్సై దనుంజేయరావు కేసు దర్యాప్తుకు నియమిస్తామని, కేసులో పురోగతి సాదించని ఎడల కేసుకు సంభందించిన పైల్ మృతిరాలు తల్లికి ఇస్తామని, అవసరమైతే కోర్టులో ప్రవేటు కేసు వేసుకోవచ్చునని హమితో దీక్ష విరమించడం జరిగిందన్నారు. పోలీసులు కేసులో పురోగతి సాదించకపోగా పైనల్ పోస్ట్ మార్టంలో జామి సింహచలంనాయుడు పురుగుల మందు త్రాగి ఉరి వేసుకున్నారని వచ్చిందని పోలీసులు తెలిపారని వారు తెలిపారు. సింహచలంనాయుడు హత్మహత్య చేసుకుంటే అయినా హత్మహత్య చేసుకోవాడానికి పేరిపించిన వారిపై కేసు అయినా పెట్టండి లేదా కేసుకు సంభందించిన పైల్ అయినా ఇవ్వాలని కె.కోటపాడు పోలీసు స్టేషన్ చుట్టు కాళ్ళు అరిగిట్టు తిరిగిన పైల్ ఇవ్వడం లెదన్నారు. ఇది అత్యంత దుర్మార్గామైన చర్యని వారు తెలిపారు. సింహచలంనాయుడు హత్యను పోలీసులు కావాలనే హత్మహత్యగా చిత్రికరించారని వారు అగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల మందు త్రాగిన వ్యక్తి మరలా ఉరి వేసుకోవలసిన అవసరం ఎముందని ప్రశ్నించారు సింహచలంనాయుడు కుటుంబానికి పోలిసులే అన్యాయం చేసారని తెలిపారు.పోలీసులు నిర్లక్ష్యనికి నిదర్శనంగా జామి సింహచలంనాయుడు కుటుబానికి న్యాయం జరిగే వరకు దేవరాపల్లి గ్రామస్తులు మద్దతు కూడా గట్టి దశలవారీగా ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు.