Jan 15,2023 17:23

వాషింగ్టన్ : మరొక నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహం ఉనికిని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి పరిశోధకులు మొదటిసారిగా ధృవీకరించారు. LHS 475 bగా వర్గీకరించబడిన ఈ గ్రహం దాదాపు భూమంతా సైజులో ఉంటుందని నాసా వెల్లడించింది. కేవలం రెండు రోజుల్లో ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేస్తుందని పరిశోధకులు నిర్ధారించగలిగారు. కానీ మన సౌర వ్యవస్థలోని ఏ గ్రహాలతో పోలిస్తే.. ఈ గ్రహం దాని నక్షత్రానికి దగ్గరగా ఉంటుందని వారు తెలిపారు. అయినా ఆ గ్రహంపై ఉష్టోగ్రత తక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. దీనికి కారణం దాని నక్షత్రం ఉష్టోగ్రత  సూర్యుని కంటే చాలా తక్కువగా (సగం కంటే తక్కువ) ఉంటుందని తెలిపారు. "భూమి-పరిమాణం, ఆ గ్రహం నుండి వచ్చిన ఈ మొదటి పరిశీలన ఫలితాలు.. దానిపై గల వాతావరణాలను వెబ్‌తో అధ్యయనం చేయడానికి, అనేక భవిష్యత్తు అవకాశాలకు తలుపులు తెరుస్తాయి. వెబ్ మన సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి ప్రపంచాల గురించి కొత్త అవగాహనకు మరింత లోతుగా తెలుసుకోవచ్చు”అని పరిశోధనా బృందంలో సభ్యుడైన మార్క్ క్లాంపిన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.