661 చేరిన మృతులు - గుంటూరులో 102 మందికి పాజిటివ్
65,818కి పెరిగిన కేసులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో గురువారం 385 మందికి కరోనా నిర్ధారణ అయింది. జిల్లాలో ఇప్పటి వరకూ 6.44 లక్షల మందికి పరీక్షలు చేయగా 65,818 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే జిల్లాలో మృతుల సంఖ్య 661 పెరిగింది. గురువారం గుంటూరులో 102 మందికి కరోనా వైరస్ వ్యాప్తి జరగ్గా జిల్లా మొత్తం మీద 283 మందికి నిర్ధారణ అయింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 451 మంది కోలుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 65,818 మందికి వైరస్ నిర్ధారణ కాగా 429 మంది మృతి చెందారు. ఇంకా 59,547 మంది కోలుకున్నారు. ఇంకా 5610 మంది చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో గురువారం నమోదు అయిన కరోనా వివరాలు
అమరావతి 1, అచ్చంపేట 4, బెల్లంకొండ 2, క్రోసూరు 2, మంగళగిరి 26, మేడికొండూరు 9, ముప్పాళ్ల 2, పెదకాకాని 5, పెదకూరపాడు 4, పెదనందిపాడు 2, పత్తిపాడు 4, ఫిరంగిపురం 2, సత్తెనపల్లి 4, తాడికొండ 1, తాడేపల్లి 4, తుళ్లూరు 7, వట్టిచెరకూరు 7, గుంటూరు కార్పొరేషన్ 102, దాచేపల్లి 4, దుర్గి 1, గురజాల 5, కారంపూడి 3, మాచర్ల 3, పిడుగురాళ్ల 4, బొల్లాపల్లి 1, చిలకలూరిపేట 18, యడ్లపాడు 1, ఈపూరు 3, నర్సరావుపేట 22, నకరికల్లు 3, రొంపిచర్ల 2, వినుకొండ 5, అమృతలూరు 4, భట్టిప్రోలు 7, బాపట్ల 18, చేబ్రోలు 11, చెరుకుపల్లి 1, దుగ్గిరాల 4, కాకుమాను 5, కర్లపాలెం 10, కొల్లిపర 1, కొల్లూరు 3 , పివిపాలెం 1, పొన్నూరు 14, రేపల్లె 14, తెనాలి 15, చుండూరు 3, వేమూరు 11
గుంటూరులో నమోదు వివరాలు
ఎటి అగ్రహారం 3, అరండల్‌పేట 11, ఆర్‌టిసి కాలనీ 3, బ్రాడీపేట 4, ఐపిడికాలనీ 2, చంద్రమౌళీనగర్ 5, ఏటూకూరు రోడ్డు 3, గుజ్జనగుండ్ల 2, కన్నా వారీతోట 2, కొత్తపేట 2, నల్లచెరువు 13, ఎన్‌జీవో కాలనీ 2, వాసవి నగర్ 3, వసంతరాయపురం 2, వెంగళారావు నగర్ 2, గుండారావుపేట 2, పాతగుంటూరు 2, లాంచెస్టర్ రోడ్డు 2, నెహ్రూనగర్ 2, సంపత్‌నగర్ 2, శ్రీనివాసరావుపేట 2, ఇతరులు 8, ఒక్కకేసు నమోదు అయిన ప్రాంతాలు 29