- మా నమ్మకం నువ్వే జగన్’ అనేది ప్రజల నినాదం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు
ప్రజాశక్తి - రేపల్లె : సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రచార కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు రేపల్లె పట్టణంలోని 13వ వార్డులో ప్రారంభించారు. ఇందులో భాగంగా పార్టీ అత్యంత విస్తృతంగా అందరినీ కలుపుకొని 'మెగా సర్వే' చేస్తుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి అన్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యాచరణ వివరిస్తూ రేపల్లె పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. ఈ సంద్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ 7 లక్షల మంది పార్టీ సైనికులు 14 రోజుల్లో ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 20 రాష్ట్రంలోని 1.6 (కోటి అరవై లక్షల) కోట్ల కుటుంబాలను.. 5 కోట్ల మంది ప్రజలను కలిసి 'మెగా సర్వే' చేయనున్నారని మోపిదేవి చెప్పారు. ఈ7 లక్షల మంది కార్యకర్తల్లో కొత్తగా నియమించబడిన గృహ సారధి మరియు వార్డు సచివాలయం కన్వీనర్లు ఉంటారు. వీరు ఇంటింటికి 'మెగా సర్వే' నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటారు అన్నారు. మీడియా సమావేశం అంతరం 13వ వార్డులో ప్రజా మద్దతు పుస్తకం మెగా సర్వే కరపత్రాల పంపిణీ ప్రజా మద్దతు పుస్తకంలోని ప్రశ్నలను అడిగి ప్రత్యేకమైన ‘పీపుల్స్ సర్వే’ నిర్వహించారు. ఈ ప్రశ్నల ద్వారా ప్రజలను వారి భవిష్యత్తు కోసం సీఎం జగన్‌ను విశ్వసిస్తున్నారా అని అడిగారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి పోలికకు సంబంధించిన కరపత్రంలో ఉండే పలు ముఖ్య విషయాలు మోపిదేవి చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలకు జగనన్నకు మద్దతు ఇస్తున్నట్లు ధృవీకరిస్తూ రసీదు ఇచ్చి, అనంతరం ప్రజల అనుమతితో జగనన్నే మా భవిష్యత్తు స్టిక్కర్లను తలుపు, సెల్ ఫోన్ స్టిక్కర్లను అతికించారు. చివరగా ప్రజలు జగనన్నకు తమ మద్దతును తెలిపేందుకు 82960-82960 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతారు. ప్రజల అనుమతితో మిస్డ్ కాల్ ఇచ్చారు. రాష్ట్రంలోని 100% కుటుంబాలను రికార్డు స్థాయిలో 14 రోజుల్లో కవర్ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అని అయన అన్నారు. గత కొన్ని నెలలుగా రెట్టింపు అయిన పార్టీ క్యాడర్ మొత్తం యాక్టివేట్ చేసి, ఇంటింటికీ వెళ్లి సీఎం జగన్ ఎలా పనిచేశారో నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుని ఆయన సందేశాన్ని చివరి మైలు వరకు తీసుకెళ్లడమే ముఖ్య ఉద్దేశం అని మోపిదేవి వివరించారు. కార్యక్రమంలో బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జున రావు మున్సిపల్ చైర్మన్ కట్టామంగా పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు










