ప్రజాశక్తి - వేమూరు, బాపట్ల జిల్లా : రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దఎత్తున చర్యలు తీసుకున్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. శనివారం వేమూరు నియోజకవర్గలోని చుండూరు మండలం లోని మoడూరు, అమృతలూరు మండలంలోని మోపర్రు గ్రామాల్లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమాల్లో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మరియు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్ళ కాలంలో 2లక్షల 40వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారులకు అందజేశారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 95శాతం అమలు చేశారన్నారు.అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేయడానికి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో పేద ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా అందించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమ కోసం ముఖ్యమంత్రి పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రంలో మహిళలను రాజకీయ, ఆర్థిక, సామాజికముగా అభివృద్ధి చెందే దిశగా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యకమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ప్రభత్వానికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల ముంగిట ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అర్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివిధ కారణాల వల్ల పొందలేని వారి కోసం మరో అవకాశం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ప్రజలకు ఉచితంగా సర్టిఫికేట్ లు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రతి రోజు జగనన్న సురక్ష క్యాంపుల్లో 40వేల సర్టిఫికేట్ లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మండూరు, పామర్రు జగనన్న క్యాంపుల్లో ప్రజలకు సర్టిఫికేట్ లను మంత్రి, జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి పార్థసారథి, వేమూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి అర్జున్, చుండూరు తహసీల్దార్ డి.కనకదుర్గ, ఎంపీడీఓ సుగుణమ్మ, అమృతలూరు తహసీల్దార్ మెహర్ కుమార్, ఎంపీడీఓ సుబాని తదితరులు పాల్గొన్నారు.










