ప్రజాశక్తి-ఉంగుటూరు : మండలం గొల్లగూడెంలో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. గ్రామంలో పలు విభాగం వారీగా దరఖాస్తులు చేసుకున్న వారికి సర్టిఫికెట్లు, ద్రవపత్రాలను అధికారులు ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా అందజేశారు. ఎంపీపీ ఘంటా శ్రీలక్ష్మి, ఇన్చార్జ్ ఎంపీడీవో ఆంజనేయులు, డిటి బొడ్డేపల్లి ప్రసాద్, వైకాపా నాయకులు దాసరి సత్యనారాయణ, మలకలపల్లి నాగు, సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు నాయకులు పాల్గొన్నారు.










