ప్రజాశక్తి-మామిడికుదురు : పేదలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు జగన్నన్న ఆరోగ్య సురక్ష ఎంతో దోహద పడుతుందని జెడ్. పి.టి.సి. కె. అంజిబాబు అన్నారు. పాశర్లపూడి సత్రంలో శనివారం సర్పెంచ్ కొనుకు ప్రేమ జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన సురక్ష శిబిరాన్ని సందర్చింసారు. వైద్యులు కె. జె. ప్రశాంత్, ప్రమోద, ఎం.ఆశా, స్పందనలు 312మందికి పరీక్షలు నిర్వయించి మందులు పంపిణి చేశారు.ఎం. పి. డి. ఒ. కె. వెంకటేశ్వరరావు, పరిపాలనా ధికారి కారుపల్లి వెంకటేశ్వరరావు, పంచాయతి కార్యదర్శి ఏర్పాటులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.టి.సిలు ఎన్.దుర్గాప్రసాద్, వీరాంజనేయలు, కె. శ్రీధర్, పి ఎ. సి ఎస్. చైర్మన్ యు. వి.వి. సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










