
ప్రజాశక్తి-ఉంగుటూరు : రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న జలకళ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉంగుటూరు నియోజక వర్గంలో 235 బోర్లు నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి.వాటిలో 159 బోర్లు నిర్మాణం జరిగాయి. వాటిలో 43 బోర్లకు మోటార్లు, పంపులు వచ్చాయి. వాటిని రైతులకి ఎంఎల్ఏ అందజేశారు. మిగతా బోర్లు కూడా సత్వరమే మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎంఎల్ఏ అన్నారు. వయసాయానికి 9గంటలు కరంట్ ఇస్తున్నామన్నారు.