
- జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి
ప్రజాశక్తి-రెడ్డిగూడెం : శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాలు మేరకు రెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పిటిసి సభ్యులు పాలంకి విజయ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గడప వద్దకే వైద్యంను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఐదు అంచెల్లో జరిగే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు, పిల్లలు, యువత ఇలా ప్రతి ఒక్కరి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించి వాటిని కచ్చితంగా పరిష్కరించేలా జగనన్న ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు. గ్రామాలలో జరిగే సురక్ష శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పల్లెలు, కాలనీల్లోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలకు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చి వైద్యం చేయడం రాష్ట్రంలో మునుపెన్నడూ చూడలేదన్నారు. ప్రజలకు ఇంటి వద్దే బీపీ, షుగర్, హెచ్‌బీ, డెంగీ, మలేరియా సహా ఏడు రకాల పరీక్షలు అవసరం మేరకు నిర్వహించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు.