Oct 18,2023 14:35

ప్రజాశక్తి-చుండూరు : జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పిలుపునిచ్చారు. బుధవారం చుండూరు మండలం తొట్టెంపూడి గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ముందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల  ద్వారా ఏ ప్రాంతంలో ప్రజలు ఎలాంటి వ్యాధులకు తరుచూ గురైతున్నారనే విషయాన్ని గమనించాలన్నారు. తద్వారా ఆ ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు అవసరమైన ముందు ఇవ్వడం జరుగుతుందన్నారు. జగనన్న  ఆరోగ్య సురక్ష క్యాంపులో ఓ.పి ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వైద్య పరీక్షలు నిర్వహించే మెడికల్ ల్యాబ్ ను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, ఎంపీడీఓ సుగుణమ్మ, తహసీల్దార్ డి.కనక దుర్గ,వైద్యులు డాక్టర్ ఇందిరా ప్రియ దర్శని,డాక్టర్ జ్యోతి రాజ్ తదితరులు పాల్గొన్నారు.