Jul 30,2022 13:03

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది మరణించాడు. ఇద్దరు భద్రతా దళాలకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. జిల్లాలోని క్రీరి ఏరియాలోని వనిగం బాలాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయని తెలిపారు. గాలింపు చర్యలు చేపడుతుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయని చెప్పారు. మృతుడు.. ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వాడో నిర్ధారించాల్సి ఉందని తెలిపారు.