Dec 22,2022 10:58

ప్రజాశక్తి - కశింకోట : రాష్ట్రములో అర్హత ఉన్న వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. స్థానిక మండల కేంద్రములో గడపగడపకి కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటికి లబ్ధిదారులకు ప్రతి నెల పింఛను పంపిణీ చెస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ ది అన్నారు. ఈ గ్రామం మోడల్ గా తయారు చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. పలు వీధుల్లో తిరిగి అర్హత పత్రం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్ పార్టీ అధికార ప్రతినిధి మళ్ళ బుల్లి బాబు, మండల పరిషత్ అధ్యక్షురాలు కలగా లక్ష్మి , మండల ఉపాధ్యక్షులు పెంటకోట జ్యోతి, సర్పంచ్ మంత్రి జయరజనీ, ఎమ్ పి డి ఓ కొంకి అప్పారావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.