Dec 23,2022 21:07

న్యూఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన రెండు చుక్కల నాసికా వ్యాక్సిన్‌ ఇన్‌కోవాక్‌ (బిబివి154) బూస్టర్‌ డోస్‌గా వినియోగించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లో నామమాత్రపు ధరకే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీనిని త్వరలో జాతీయ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కో-విన్‌లో ప్రవేశపెట్టే అవకాశముందని తెలిపాయి. ఇప్పటికే కొవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ టీకాలు తీసుకున్న వారు ఈ చుక్కల మందును హెటిరోలాగస్‌ బూస్టర్‌ డోస్‌గా తీసుకునేందుకు భారత డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ నవంబర్‌లోనే అనుమతించారు. మనదేశంలో 18 ఏళ్లు పైబడిన వారంతా ఈ టీకాను వినియోగించుకోవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి.