ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో 138 బెట్టింగ్ యాప్‌లు, 94 రుణ యాప్‌లను నిషేధించాలని, మరికొన్నింటిని బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 232 యాప్స్‌పై తక్షణ, అత్యవసర ప్రాతిపదికన ఈ చర్యకుసిద్ధమైనట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఈ నిర్ణయం జరిగిందని, యాప్‌ల నిషేధానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని పేర్కొన్నాయి. ఐటీ చట్టంలోనిసెక్షన్ 69 కింద భారత సార్వభౌమత్వం, సమగ్రత పట్ల పక్షపాతంగా వ్యవహరించే ఉద్దేశాలను ఈ యాప్‌లలో గుర్తించడంతో ఈ చర్య తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. లోన్ యాప్‌లు రుణాల పేరిట దోపిడీకి గురిచేస్తునాుయనే ఆరోపణలునాుయి. భారీ వడ్డీ రేట్లు విధిస్తున్నాయి. ఆ వడ్డీలను చెల్లించలేని రుణగ్రస్థులను యాప్‌ల ప్రతినిధులు వేధింపులకుగురిచేస్తునాురు. అసభ్యకరమైన సందేశాలను పంపిస్తున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను కాంటాక్ట్ నంబర్లకు పంపించి అవమానానికి గురిచేస్తున్నాయని ఐటీ మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా పలు రాష్ట్రాల్లో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడిన పలు ఘటనలు వెలుగు చూశాయి.
ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆరు నెలల క్రితం 28 లోన్ యాప్‌లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. తాజాగా మరో 94 యాప్‌లు థర్డ్-పార్టీ లింక్స్ ద్వారా ఈ-స్టోర్స్‌లో లభ్యమవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. జూన్ 2020 నుంచి 200కుపైగా యాప్‌లను కేంద్రప్రభుత్వం నిషేధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, షేర్ ఇట్, వీచాట్, హెలో, లైకీ, యూసీ న్యూస్, బిగో లైవ్, యుసి బ్రౌజర్స్, ఇఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, ఎంఐ కమ్యూనిటీ సహా పలు యాప్‌లు ఉన్నాయి.










