- న్యూజిలాండ్ 273/9.. భారత్ లక్ష్యం 227
ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాలలో న్యూజిలాండ్-భారత్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో డార్లీ మిచెల్ 127 బంతుల్లో 134 పరుగులు సెంచరీ సాధించగా.. షమీ 5 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 273 పరుగులకు అలౌట్ అయ్యి.. భారత్ లక్ష్యం 274గా నిర్దేశించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కాన్వే డక్‌ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ కాసేపటికే 17 పరుగులు చేసిన విల్‌యంగ్ షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్ ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి దాదాపు 163 పరుగులు చేశారు. ఈ క్రమంలో రచిన్ రవీంద్ర 87 బంతుల్లో 75 పరగులు చేసి షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే టామ్ లాథమ్ కుల్‌దీప్ బౌలింగ్‌లో ఎల్బీ, 23 పరుగులు చేసిన గ్లెన్‌ఫిలిప్స్ కూడా కుల్‌దీప్ బౌలింగ్‌లోనే ఔటాయ్యాడు. మార్క్ చాప్‌మన్ 6 ను బుమ్రా, మిచెల్ సాంట్నర్ 1 మాట్ హెన్రీ 0 లను షమీ వెంటవెంటనే ఔట్ చేశాడు. లాకీ ఫెర్గూసన్ 1 పరుగు చేశాడు.
- డార్లీ మిచెల్ సూపర్ సెంచరీ..
న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డార్లీ మిచెల్ సెంచరీతో చెలరేగాడు. 100 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 41 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్(100), ఫిలిప్స్(12) ఉన్నారు.
- టామ్ లాథమ్ ఔట్
5 పరుగులు చేసిన టామ్ లాథమ్ కుల్‌దీప్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవలియన్‌కు చేరాడు. క్రీజులోకి గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు. మరోవైపు డారిల్ మిచెల్ 94 పరుగులు చేసి సెంచరీకి దగ్గరలో ఉన్నాడు.
- రచిన్ ఔట్..
87 బంతుల్లో 75 పరుగులు చేసిన రచిన్ షమీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. న్యూజిలాండ్ 33 ఓవర్లకు 178 పరుగులు చేసింది. క్రీజులోకి టామ్ లాథమ్ వచ్చాడు. డారిల్ మిచెల్ 78 బంతుల్లో 75 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- 28 ఓవర్లకు న్యూజిలాండ్ 138/2
28 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. రవీంద్ర(59), డార్లీ మిచెల్(57) పరుగులతో క్రీజులో ఉన్నారు.
- డార్లీ మిచెల్ 50
60 బంతుల్లో డార్లీ మిచెల్ 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. మరోవైపు రవీంద్ర 66 బంతుల్లో 56 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు. 26 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ 128/2గా ఉంది.
- రచిన్ రవీంద్ర 50
న్యూజిలాండ్ వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ 56 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు 1సిక్స్ ఉన్నాయి. మరోవైపు డారిల్ మిచెల్ 38 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.
- 100 పరుగులు చేరుకున్న న్యూజిలాండ్
భారత్‌తో జరగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 21 ఓవర్లు పూర్తయ్యే సరికిక 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. రచిన్ రవీంద్ర 40, డారిల్ మిచెల్ 38 పరుగుల మీద ఆడుతున్నారు.
- 20 ఓవర్లు పూర్తి
20 ఓవర్లు పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ 91 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర 46 బంతుల్లో 39 పరుగులు చేయగా.. డారిల్ మిచెల్ 38 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
- 14 ఓవర్‌లో 3 పరుగులు
జడేజా వేసిన 14 ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో న్యూజిలాండ్ 14 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 18 బంతుల్లో 14 పరుగులు, రచిన్ రవీంద్ర 30 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
- 10 ఓవర్లకు 34
10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 34 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 7 బంతుల్లో 7 పరుగులు చేయగా, రచిన్ రవీంద్ర 17 బంతుల్లో 6 పరుగులు చేశాడు. మరోవైపు 3వ వికెట్ కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
- షమీ తొలి బంతికే వికెట్
2023 వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మహ్మద్‌షమీకి తన తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ దక్కింది. 27 బంతుల్లో 17 పరుగులు చేసిన కాన్వేను షమీ ఔట్ చేశాడు. క్రీజులోకి డారిల్ మిచెల్ వచ్చాడు. న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది.
- 7 ఓవర్లకు 18 పరుగులు
7 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 18 పరుగులు చేసింది. బూమ్రా వేసిన 7వ ఓవర్‌లో 0,0,4,1,0,0 మాత్రమే వచ్చాయి. ఓపెనర్ విల్‌యంగ్ 20 బంతుల్లో 16 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 13 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు.
- కాన్వే ఔట్
సిరాజ్ బౌలింగ్‌లో కాన్వే తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. సిరాజ్ బౌలింగ్ శ్రేయస్ అయ్యార్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. క్రీజులోకి రచిన్ రవీంద్ర వచ్చాడు.
- 3 ఓవర్లకు 9
3 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 9 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్‌యంగ్ 12 బంతుల్లో 9 పరుగులు చేయగా కాన్వే 8 బంతులు ఆడి ఖాతా తేరవలేదు.
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాలలో నేడు న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టస్ గెలిచిన భారత్ జట్టు తొలుత బౌలింగ్ తీసుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ హార్ధిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్, శార్ధుల్ స్థానంలో షమీ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్ జట్టు గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.
భారత్ : రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వి), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (ష/ష), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్










