May 10,2023 16:09

ప్రజాశక్తి - జీలుగుమిల్లి : జీలుగుమిల్లి మండలంలో ఆవాస్ యోజన పథకం కింద మొదటి విడతగా మండలం వ్యాప్తంగా 784 జగనన్న   ఇళ్లు మంజూరు అయ్యాయి. మంజూరైన ఇళ్లకు మొదట్లో  5000 రూపాయలు నేరుగా లబ్దిదారుల అకౌంట్ లో జమ చేశారు. దీనికి  గాను తహశీల్దార్ ఎలీషా కు ఎంపిడిఓ మంగతాయారుకు కొన్ని పంచాయితీలు అప్పగించి ఆయా ఇళ్లను 100 రోజుల్లోగ పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. దీనికి సంబంధించి మొదట్లో  విడతల వారీగా కొంత మేటిరియల్ ను లబ్దిదారులకు అందించడంతో పాటు అధికారుల ఒత్తిడి తో ఎట్టకేలకు 210  ఇళ్ళ వరకు బేస్మెంట్  వరకు పూర్తి చేయించారు.వారికి మాత్రం మరో విడత గా 35000 వేలు జమ చేశారు. కొన్ని ఇళ్ళకు ఇంకా ఇంకా బేస్మెంట్ బిల్లులు రావాల్సి ఉందని లబ్ధిదారులు అవేదన చెందుతున్నారు. మండలంలో ఇంకా బిల్లులు పడని ఇల్లు చాలా వరకు ఉన్నాయి.కొంతమంది బయట అప్పులు తెచ్చి మరి ఇల్లు నిర్మాణం చేస్తున్నప్పటికీ  బిల్లులు చెల్లింపులు సరిగ్గా జరగకపోవడంతో ఇంటి నిర్మాణం చేయాలంటే భయపడి పోతున్నారు. 100 రోజుల్లో ఇల్లు పూర్తి చేయలని ఆదేశాలు ఇచ్చిన బిల్లులు సరిగ్గా పడక పోవడంతో లబ్ధి దారులను వత్తిడి చేయలేక అసహనం వ్యక్తం చేస్తున్నారు.