Jul 26,2023 12:17

ప్రజాశక్తి-చిన్నగంజాం(బాపట్ల) : అక్రమ మద్యము అమ్ముతూ అరెస్టు అయ్యి ఒంగోల్ జైల్ కి తరలించిన ఘటన మండలం లోని అడివిదీపాలెం లో జరిగింది. ఎస్సై కె సురేష్ తెలిపిన వివరాల ప్రకారం అడివిదీపాలెం గ్రామానికి చెందిన వడ్లమూడి సత్యనారాయణ తను నిర్వహించే దుకాణంలో అక్రమంగా మధ్యం అమ్ముతున్నట్టు మంగళవారం రాత్రి వచ్చిన సమాచారం వచ్చి నట్టు తెలిపారు. తన సిబ్బందితో దాడి చేయగా 15సిల్వర్ స్ట్రిప్స్ విస్కీ బాటిల్స్ లభించాయన్నారు. నిందుతుని అదుపులోకి తీసుకోని రిమాండ్ తరలించామన్నారు. అక్రమంగా మద్యం అమ్మితే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.