
- ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలు నాయుడుకు సిపిఎం బహిరంగ లేఖ
ప్రజాశక్తి-దేవరాపల్లి : మండలం తారువా మరియు మారేపల్లి దేవరాపల్లి రెవెన్యూల్లో భూ ఆక్రమణలు వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలు నాయుడుకు బుధవారం బహిరంగ లేఖ వ్రాసారు. అనంతరం అయిన మాట్లాడారు, తారువా రెవెన్యూలో సర్వే నెంబరు 179 లో రెడ్డి వారి చేరువు మరియు మరికోన్ని సర్వే నెంబర్లులో గతంలో ఉన్న తహశీల్దార్ రమేష్ బాబు ప్రభుత్వ భూములగా గుర్తించి బోర్డులు పెట్టారు. చుట్టుప్రక్కల భూములు కోనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈభూమిని అడ్డగోలుగా కబ్జా చేసారు,దీనిపై విఆర్వో సర్వేయరు వెళ్ళిచూసి డిప్యూటీ తహశీల్దార్ కు అక్రమణ జరిగినట్లు తెలియజేసారు, ఈతగాదాలోను మరియు దేవరాపల్లి సర్వే నెంబరు 20లో 38 ఎకారాలు 1997 కోర్టు వివాదం తరువాత ఎట్టకేలకు మార్చి 21/2023 న ఆక్రమణ దారునికి వ్యతిరేకంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ కేసు కోట్టు వేస్తు తీర్పునిచ్చింది. దీనిని రెవిన్యూ అదికారులు స్వాధీనం చేసుకోండా తమరు అడ్డం పడుతున్నారు, మరికోన్ని కోర్టు వివాదాలు గల భూములు చాకచక్యంగా పరిష్కారం చేస్తూ ప్రజలకు ఎళ్ళప్పుడు అందుబాటులో ఉంటు నిజాయితీగా పని చేసినందుకు డిప్యూటీ తహశీల్దార్ ను అనకాపల్లి కలెక్టరేట్ కు డిప్యూటేషన్ పై బదిలీ చేసారు.
అదేవిధంగా మారేపల్లి రెవిన్యూ లో సర్వే నెంబరు 115 లో 23,15 సెంట్లు దేవుని భూమిని మీ తారువా గ్రామానికి చేందిన కొంతమంది అన్యాక్రాంతం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మేసారు. ఇదిదేవుని భూమి అని విశాఖపట్నం మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టు 1999లో ఇచ్చిన తీర్పుతో సహా అన్ని రెవెన్యూ రికార్డులోను దేవుని మాన్యాంగా ఉంది దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేసిన ఇద్దరు దేవదాయశాఖ అస్టేంటు కమీషనర్లును మీ అధికారాన్ని ఉపయోగించి బదిలీ చేయించారు, ఈభూమిని దేవదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకోకుండా అడ్డం పడుతున్నారు, ఈభూమి ప్రస్తుతం వివాదంలో ఉంది. దేవరాపల్లి రెవెన్యూకు చేందిన సర్వే నెంబర్ 280/1లో దేవరాపల్లి గ్రామానికి చేందిన క్షేత్రియ దేవిసింగ్ కు పట్టా ఇచ్చారు. ఇది అన్యాక్రాంతం అయ్యింది. దీనిపై ఇతను చోడవరం కోర్టులో కేసు వేసారు. చోడవరం కోర్టులో కేసు కోట్టీ వేసింది ఇతను మరనించినప్పటికి మరనించిన వ్యకి పెరున మరల గౌరవ హైకోర్టులో కేసువేసారు,కోర్టు నుండి తీర్పు వచ్చే వరకు భూమిలోకి వెళ్ళరాదు. అయినప్పటికి ఆభూల్లో ఫలసాయం వేస్తున్నారు, 281/2 కూడా చోడవరం కోర్టులో కేసు వేసారు ఇది కూడా కేసు కోట్టి వేయడంతో మరల గౌరవ హైకోర్టు నందుకేసు వేసి, ఈ సర్వేనెంబరు 281/2 ను 281/2 A అని తప్పుడు రికార్డు స్రుష్టించి ఫలసాయం తీసుకోవాడానికి అనుమతి తెచ్చుకోని ఫలసాయం తీసేసుకోవడం జరిగింది,ఆయన రెవెన్యూ అదికారులు కళ్ళు అప్పగించుకోని చూసారు. మరల ఫలసాయం వేస్తూన్నారు 281/2 A అనే సర్వే నెంబర్ ఎ రెవెన్యూ రికార్డుల్లోను లేదు అయనప్పటీకి తప్పుడు రికార్డుల స్రృష్టించి, మీ అండదండలతో రెవెన్యూ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈభూములు ఆక్రమించిన వారు అందరూ మీపార్టిలో ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్నవారు,మరియు వారి భందువులు ఉన్నారు, అడ్డ గోలుగా కోర్టు చుట్టూ రెవెన్యూ అధికారులను తీప్పుతున్నారు. అక్రమంగా పంటలు వెస్తూన్నారు, పట్టించు కోవలసిన రెవెన్యూ అధికారులు మీకు, మీపార్టీకి భయపడి పట్టించుకోకుండా ఆక్రమణ దార్లు పట్ల ఉదారంగా వ్యవహరిస్తూన్నారు. కోర్టు వివాదం ఉన్న భూముల్లో పంటలు వేయడం తప్పుడు రికార్డులు స్రృష్టించి కోర్టులను ప్రజలను తప్పుదోవ పట్టించడం సరియైనది కాదు. మీ సోంత గ్రామంలో ఆక్రమిత భూములకు తహశీల్దార్ బోర్డులు పెట్టిన ఆ భూములను అడ్డగోలుగా కబ్జాచేసెత్తున్నారు. వీటిని వెంటనే నిలుపుదల చేసి ఆక్రమణ దారునిపై చర్యలు తీసుకోవాలి. దేవరాపల్లి సర్వే నెంబరు 20కి గల భూములకు సరిహద్దులు, తేల్చి రక్షణ కల్పించాలి, కోర్టు వివాదంలో భూముల్లో పంటలు వేయాడాన్ని వెంటనె నివారించేందుకు అదికారలకు తగు ఆదేశాలు ఇవ్వని ఎడల ఆక్రమణ దార్లుకు మీరు, మీప్రభుత్వం కోమ్ము కాస్తున్నట్లు బావించవలసి వస్తుంది చట్టాన్ని అమలు చేయవలసిన మీరు, నిజాయితీగా పని చేస్తున్న అధికారులను బదిలీ చేయడం డిప్యూటేషన్ పై పంపించడం వంటి చర్యలు ప్రజలకు బాద కలిగిస్తుంది. గతంలో ఈభూల్లో పంటలు తీసిన పంటలు వేసిన కేసులు పెట్టి ఫలసాయంను వేలం వేసిన సందర్బాలు ఉన్నాయి. మీ పార్టీ అదికారంలోకి వచ్చిన తరువాతనే కబ్జాదారులు అడ్డగోలుగా వ్వహరిస్తూన్నారు. దీనివలన మీపార్టికి మీకు పూర్తిగా చేడ్డ పేరు వస్తుంది. కావున వెంటనే భూ ఆక్రమణలు నిలుపుదలకు రెవెన్యూ అధికారులకు తగు అదేశాలు ఇవ్వాలని వెంకన్న అ లేఖలో కోరారు.