
న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ తాజాగా డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తెచ్చింది. తమ యాప్ ద్వారా 'నగదు రహిత లావాదేవీ'లను చేయడానికి వీలుగా 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పిసిఐ) ఆమోదం తెలిపిందని ఫేస్‌బుక్ సిఇఒ జూకర్‌బర్గ్ శుక్రవారం ప్రకటించారు. వాట్సప్ ద్వారా చేసే చెల్లింపులకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. శుక్రవారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చినపపటికీ.. అందరికీ ఈ అవకాశం కల్పించలేదు. దశల వారిగా ఈ సేవలను విస్తరించుకోవచ్చని. తొలుత 2 కోట్ల వాట్సాప్ వినియోగదారులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. వాట్సాప్ గత రెండేళ్లుగా తన యుపిఐ ఆధారిత పేమెంట్ పైలెట్ సర్వీసును నడుపుతోంది. కానీ డేటా లోకలైజేషన్ అవసరాల కారణంగా అధికారికంగా అనుమతికి ఆలస్యం అయ్యింది.