
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు డి దేవానందరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల పదో తేదీతో ఫీజు చెల్లింపు గడువు ముగియనుండగా, ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 25 వరకు, రూ.200 అపరాధ రుసుంతో 30 వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబరు 5 వరకు చెల్లించవచ్చునని పేర్కొన్నారు.