Dec 16,2020 20:48

న్యూఢిల్లీ : భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులకు వీలుగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. వాట్సప్‌ పేమెంట్‌ కోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పిసిఐ)కి చెందిన యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్ఫేస్‌(యుపిఐ) సిస్టమ్‌ యూజర్లకు అందుబాటులోకి ఉందని తెలిపింది. డిజిటల్‌ ఎకానమీ, ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ లాంటి లాభాలను ఎక్కువ మందికి అందించేందుకు కఅషి చేస్తున్నామని వాట్సప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌ తెలిపారు. సులభంగా, సురక్షితంగా డబ్బులను పంపించుకోవడానికి తాజా ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.