Apr 23,2023 16:45

ప్రజాశక్తి - జీలుగుమిల్లి(ఏలూరు) : ఐ సి ఏ ఆర్ సంస్థ లో తొలి సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్ గా జీలుగుమిల్లి సి టి ఆర్ ఐ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్ గా పని చేస్తున్న టి.రమేష్ ఎంపిక అయినట్లు సి టి ఆర్ ఐ సంస్థ ఓ ప్రకటన లో తెలిపారు.డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్   వారు పుణె లో నిర్వహించిన రాత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఐ సి ఎ ఆర్ తరపున తొలి సర్టిఫైడ్ పైలెట్ లైసెన్స్ ను పొందినట్లు తెలిపారు.ఐసిఏఅర్ అధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ విధానం లో శాస్త్ర సాంకేతికను రైతులకు అందించే విధానం లో భాగంగా వ్యవసాయం లో డ్రోన్ ల వినియోగానికి పైలెట్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండేలా ఆదేశాల ప్రకారం పి సి బి ఎరో హబ్ లో శిక్షణ పొంది పైలెట్ లైసెన్స్ ను పొందినట్లు రమేష్ తెలిపారు.పైలెట్ గా ఎంపికైన రమేష్ కు సి టి ఆర్ ఐ డైరెక్టర్ మాగంటి.శేషు మాధవ్ సి టి ఆర్ ఐ హెడ్ సుబ్బయ్య,ఫామ్ మేనేజర్ జయకృష్ణ,పలువురు రైతులు అభినందనలు తెలిపారు..