ఎర్రమట్టిలో రాగులు పండాయి
నల్లమట్టిలో వరి కంకులు పెరిగాయి
బురద నేలలో కమలాలు విరిశాయి
ఎడారి ఇసుకలో జిల్లెళ్ళు మొలిచాయి
వణుకుతున్న చలిలో సిమ్లా యాపిళ్లు రాలిపడ్డాయి
ఆంక్షల మద్యలో జొన్న చేలు కంకులై నిటారుగా నిలబడ్డాయి
వాన రాకపోయినా వేరుశనగ పూలు నవ్వాయి
తుపాను లొచ్చినా గోధుమ ధీమాగా నిలబడింది
ఇంత ఆకలి తీర్చిన నేల నుంచి
తరతరాలుగా పాతుకుపోయిన
నాలుగు కాళ్ల కుర్చీల నయవంచనని
మూలాల నుంచి పెళ్లగించడానికి
ఈ దేశపు చెట్లకి నాగళ్లు మొలిచాయి.
* అనిల్ డ్యాని, 9703336688