కరాచీ : మధ్యధరా సముద్రంలో గ్రీస్ తీర జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారిలో 300 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ సెనెట్ చైర్మన్ మొహ్మద్ సాదిఖ్ సంజ్రాని ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. ప్రమాదం నుంచి 12 మంది పాకిస్తానీయులు ప్రాణాలను కాపాడుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. గ్రీస్‌లోని పాకిస్తానీ మిషన్ 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వందల మంది పాకిస్తానీయుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై ఉన్నతాస్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.పడవ ప్రమాదంలో అధికశాతం మంది బాధితులు పాకిస్తానీయులు ఉండటంపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సోమవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.
750 మంది శరణార్థులతో ఇటలీకి తీసుకెళుతున్న గ్రీస్‌కు చెందిన చేపల వేట బోటు సముద్రంలో బుధవారం బోల్తాపడిన ఘటన తెలిసిందే. పడవ లిబియాలోని టబ్రుక్ నుంచి ఇటలీకి బయల్దేరిన సమయంలో గ్రీస్‌లోని ప్యాలోస్ తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన చోటు చేసుకొంది. ఇప్పటి వరకు 79 మృతదేహాలను వెలికి తీశారు. యూనియన్ (ఇయు) ఎదుర్కొంటున్న శరణార్థుల సంక్షోభానికి ఈ ఘటన తాజా ఉదహరణ. యుద్ధం, హింస, పేదరికం కారణంగా వలసలు పెరుగుతున్నాయి.