ప్రజాశక్తి-నందిగామ : ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ (అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం) మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 20 22 సందర్భంగా స్థానిక మరియనివాస్ జూనియర్ కాలేజ్ లో మానవ హక్కుల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ పాత్రికేయులు డాక్టర్ గంటా విజయ్ కుమార్ ప్రసంగిస్తూ గౌరవం స్వేచ్ఛ అందరికీ న్యాయం ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ మానవ హక్కుల అంశంగా ఎంచుకోవడం జరిగిందని మనమందరం వాటిని గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు . ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం దక్షిణ భారత వర్కింగ్ చైర్మన్ ఆత్కూరు బాలాజీ మాట్లాడుతూ 1948 డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం గా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిందని దీని ప్రకారం జాతి రంగు మతం లింగం భాష రాజకీయ జాతీయ లేదా సామాజిక మూలం ఆస్తి పుట్టుక లేదా ఇతర హోదాలతో సంబంధం లేకుండా అందరూ సమానం అని తెలిపారు. బాలల హక్కులను 1989లో ఐక్యరాజ్యసమితి తీసుకురాగా 1992 డిసెంబర్ 11న భారతదేశం ఆమోదించదని, ఈ చట్టం ప్రకారం బాలలను తల్లిదండ్రులు టీచర్లు పనిచేసే చోట యజమానులు కొట్టడం తిట్టడం అవమానించడం స్వార్థ ప్రయోజనాల కొరకు వినియోగించుకోవడం సరైన ఆహారం అందించకుండా ఉండడం బాలల హక్కులను హరించడం గా పరిగణిస్తూ శిక్షార్హమైన నేరాలుగా చట్టం ద్వారా ప్రకటించబడుతుందని తెలిపారు. అంతేకాక ఒంటరిగా తప్పిపోయిన తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలలు చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 ద్వారా సహాయం పొందవచ్చు అని తెలిపారు. డాక్టర్ అంజలి మాట్లాడుతూ ఆడపిల్లలు అబార్షన్, చదువుకునే హక్కు, బాల్య వివాహాలు, చైల్డ్ ట్రాఫింగ్, లైంగిక దాడులు గృహహింస మీద అవగాహన కల్పించారు.
వై ధీరజ్ కుమార్ మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు పిల్లలు ఖచ్చితంగా స్కూలుకి పంపించాలని కోరారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియ నివాస్ కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ గీత మరియు తదితరులు పాల్గొన్నారు.










