కాలసముద్రంలో కలిసిపోయాయి
నేను నది నువ్వు సాగరం
ఏడడుగులు ఏనాడు పడ్డాయో
కొనసాగుతూనే వుంది మన యాత్ర
నాకు గాయమైతే సలపరం నీకెలా
నువ్వు కన్నీళ్లు కారిస్తే
నా కళ్లెందుకు సజల?
పుష్పాలుగా మారుతున్నాయి
ప్రేమే ఇరుసుగా మన
బతుకు బండి పరిగెడుతోంది
ఇప్పుడు మనకు
సరిహద్దులు లేనే లేవు
ఎప్పటిలా మన దేహాలకు అలసటా లేదు
నువ్వు చెట్టువి నేను విత్తుని
పండి నేల రాలడం మనకు పరిపాటే
కాల ప్రవాహంలో నౌకలై తేలియాడడం
కాలాన్ని వేళ్ళ సందుల్లోంచి ఖర్చు పెట్టడం
మనకే చెల్లింది !
- చింతా అప్పల నాయుడు
94417 13185










