Dec 03,2022 16:16

ప్రజాశక్తి - జీలుగుమిల్లి : మండలం వ్యాప్తంగా మొదటి విడతలో మంజూరైన ఇళ్ళ నిర్మాణాలను త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని మండల ప్రత్యేక అధికారి పివిఎస్ నాయుడు అధికారులకు తెలిపారు. హౌసింగ్ డే కార్యక్రమంలో భాగంగా శనివారం పి.రాజవరం పంచాయితిలో ఏర్పాటు చేసిన గ్రామసభ కార్యక్రమం లో తహశీల్దార్ ఎలీషాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అవాస్ లో మొదటి విడతలో మంజూరైన ఇళ్ళకు సంబంధించి పనులను ప్రారంభించి ఇళ్ళ నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అందుకు గాను మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు కృషి చేయలని కోరారు.

  • పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్

పాలాచర్ల రాజవరంలో వున్న పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళి ఓటరు కార్డుకి ఆధార్ అనుసంధానం ప్రక్రియ ను తహశీల్దార్ ఎలీషాతో కలిసి పరిశీలించారు.ప్రతి ఒక్కరూ ఓటరు కార్డుకి ఆధార్ అనుసంధానం చేసుకునేల సిబ్బంది కృషి చేయలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో  తహశీల్దార్ జి.ఎలీషా, ఏపిఎం రామారావు,ఏపిఓ జాన్ వెస్లీ,హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు పంచాయితి సచివాలయ కార్యదర్శులు అశోక్, రవీంద్ర పాల్గొన్నారు.