
ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం ఇలపకుర్తి కృష్ణారావు,60 నరసాపురంలో కరెంట్ షాక్ తగిలి శుక్రవారం ఉదయం మృతి చెందారు. నరసాపురంలో ఆయన కొత్త ఇంటి నిర్మాణంకు నీటితో పైప్ తో తడుపుతుండగా కరెంటు షాక్ తగిలి కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన స్వగ్రామం యలమంచిలి మండలం బాడవ, ఆయన పనిచేస్తున్న పాలకొల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయఝ మృతి పట్ల ఉపాధ్యాయ సంఘాలు , మున్సిపల్ కమిషనర్ శేషాద్రి సంతాపం ప్రకటించారు.