పోపుల పెట్టెలో ఉండే ఆవాలు అందరికీ తెలిసినవే. వాటి నుంచి తీసిన నూనె కొంచెం ఘాటుగా ఉంటుంది. ఈ నూనెను వంటల్లోనే కాక, పెయిన్ రిలీవర్‌గా, కొన్ని కాస్మెటిక్ ప్రయోజనాల్లోనూ ఉపయోగిస్తారు. ఇతర నూనెలకు ప్రత్యామ్నాయంగా ఆవనూనెను వాడడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఙ గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఆవనూనె ఔషధంగా పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఇందులో మోనో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, పోలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
ఙ ఆవనూనె జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగివున్న ఆవనూనె ఇన్ఫెక్షన్ల నుంచి జీర్ణవ్యవస్థకు కాపాడుతుంది. ఇందులోని గ్లూకోసినోలేట్ క్యాన్సర్, ట్యూమర్లను అరికడుతుంది.
ఙ చిగుళ్లు, దంతాలను బలపరిచేందుకు ఆవనూనె సహకరిస్తుంది. దంతాలపై పేరుకుపోయిన ఫ్లేక్, బ్యాక్టీరియాను ప్రభావవంతంగా తొలగిస్తుంది. పంటినొప్పి, నోటి దుర్వాసనను అరికడుతుంది. సహజసిద్ధమైన టీత్ వైటనర్‌గా పనిచేస్తుంది.
ఙ ఇది దగ్గు, జలుబు, ఆస్తమా, సైనసైటిస్ వంటి శ్వాసనాళ సంబంధింత సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచి, ముక్కు దిబ్బడను తగ్గించి, రెస్పిరేటరీ ట్రాక్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఙ థైరాయిడ్ సమస్యలున్నవారు ఆవనూనెను వాడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు వంటల్లో ఆవనూనె వాడడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. తద్వారా అధిక బరువు చెక్ పెట్టవచ్చు. కిడ్నీ సమస్యలనూ దూరం చేస్తుంది.
ఙ చర్మ సంరక్షణలో అద్భుత ఫలితాలను చూపిస్తుంది. చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. చిన్నపిలల్లకు మసాజ్ ఆయిల్‌గా ఆవనూనెను ఎక్కువగా వాడతారు. తద్వారా కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడు బ్యాక్టీరియాపై దాడి చేసి స్కిన్ ఇన్ఫెక్షన్లు అరికడుతుంది.
ఙ ఆవనూనెలో శిరోజాలను సంరక్షించే గుణాలు అధికం. ఇందులోని బేటా కెరోటిన్ హెయిర్ గ్రోత్‌ను పెంచుతుంది. స్కాల్ప్, జుట్టును నూనెతో మసాజ్ చేయడం ద్వారా రక్తప్రసరణ పెంపొంది జుట్టు మూలాల నుంచి ఆరోగ్యంగా తయారవుతుంది. హెయిర్ ఫాల్, జుట్టు తెల్లబడే సమస్యలు తగ్గుతాయి. శిరోజాలు ప్రకాశవంతంగా, ఒత్తుగా తయారవుతాయి.