
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : డ్రైడేలో ప్రజల భాగస్వామ్యం వలన దోమల ద్వారా వచ్చే వ్యాధుల నియంత్రణకు అడ్డుకట్ట వెయ్యొచ్చని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వై.వి.లక్ష్మణరావు తెలిపారు. సోమవారం డా వై.యస్.ఆర్ పట్టణ ఆరోగ్యకేంద్రము కడకట్ల పరిధిలోని 28వ వార్డులో జరుగుతున్న 50వ విడత ఫీవర్ సర్వే ప్రదేశాలను, డెంగ్యూ నివారణ మాసో త్సవాల పై అవగాహన కార్యకరమాలను తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వై.వి.లక్ష్మణరావు పరిశీలించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, వాటిని నియంత్రించ వలసిన ప్రాధాన్యతను ప్రజలలో అవగాహన కల్పించటానికి సిబ్బంది కృషి చేయాలని, దోమల వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ఆవాహన కల్పించారు. దోమల నియంత్రణకు డ్రైడే ఫ్రైడే కార్యక్రమము ప్రతి గృహము వద్ద జరగాలని, పరిసరాల పరిశుభ్రతను పాటించుట ద్వారా దోమల వ్యాప్తిఅడ్డు కట్ట వేయాలని ఆయన సూచించారు. దోమల నియంత్రణ అందరి భాద్యత అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, శానిటేషన్ కార్యదర్శులు, వార్డు ఇంఛార్జి తదితరులు పాల్గొన్నారు.