ప్రజాశక్తి-విశాఖ : అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పినాకిల్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంపు జరిగింది. ప్రజా ఆరోగ్య వేదిక, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ టీ కామేశ్వరావు అధ్యక్షతన అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మెడికల్ క్యాంపు జరిగింది. పినాకిల్ హాస్పిటల్స్ వారు బీపీ, షుగర్, ఈసిజి పరీక్షలు ఉచితంగా జరిపారు. అలాగే మ్యాక్సీవిజన్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు సలహాలు ఇవ్వబడ్డాయి మరియు వీ డిజిటల్ వారి సౌజన్యంతో దంత పరీక్షలు అలాగే దంతాలకు తీసుకోవలసిన జాగ్రత్తలు మందులు ఇవ్వబడ్డాయి. వీరితోపాటు డాక్టర్ కుప్పిలి సురేష్ వీరితో పాటు అల్లూరి సీతారామరాజు విజ్ఞానకేంద్రం సభ్యులు ఎమ్ఆర్పి రాజు, జి ఎస్ రాజేశ్వర ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ నాయకులు చంద్రమౌళి, మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు ఎం హరి, డి వి ఎఫ్ వై నాయకులు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మెడికల్ క్యాంపుకు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం పరిసర ప్రాంతాల్లో ప్రజలు సద్వినియోగపరచుకున్నారు.