లఖ్‌నవూ: హథ్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. యూపీ డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు బాధిత కుటుంబాన్ని కలిసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళలపై దారుణమైన నేరాలను నిరోధించలేక పోవడంపై వెల్లువెత్తిన నిరసనల ఒత్తిడిలో ఉన్న అధికార బిజెపి... హథ్రాస్ కేసు సిబిఐకి అప్పగించింది.










