Aug 30,2022 16:18

ప్రజాశక్తి-విశాఖ: జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జి వి ఎం సి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ టి నూకరాజు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు 6నెలలు బకాయి హెల్త్ అలవెన్సులు వెంటనే చెల్లించాలన్నారు. కొన్ని మున్సిపాలిటీలు అలెవెన్సులు ఇచ్చి విశాఖపట్నం జిల్లాలో ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు. అలాగే సుమారు 200మంది పారిశుద్ధ్య కార్మికులకు 5నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా బ్రతకాలన్నారు. పైస్థాయి అధికారులు మాత్రం ప్రతీ నెల 5తేదీలోపు జీతాలు తీసుకుంటారు కానీ క్రింది స్థాయిలో పనిచేస్తున్న కార్మికుల జీతాలు ఇవ్వాలని ఎందుకు ఆలోచించడం లేదన్నారు. అలాగే మరణించిన, అనారోగ్యం పాలైన,60సం,, వయస్సు అని నిలుపుదల చేసిన కార్మికులు కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలన్నారు. క్లాప్ డ్రైవర్ లకు జీవోనెంబరు 7 ప్రకారం 18,500జీతం ఇవ్వాలన్నారు సమ్మె చేసి నెలరోజులు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మినిస్ట్ కాపీ ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు, సమ్మె కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లను అమలు చేయకపోతే మరో సమ్మె  అనివార్యమని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జోన్ నాయకులు జె నాయుడు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పనిముట్లు, చీపురు తట్టలు ఇవ్వటం లేదు అని వెంటనే ఇవ్వాలని, అలాగే సబ్బులు, నూనెలు, గ్లవుజులు ఇవ్వాలన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు ఎం ఈశ్వరరావు, పి అప్పలరాజు మాట్లాడారు. ఈకార్యక్రమంలో జోన్ నాయకులు, యల్లమ్మ, కిషోర్ రత్నం అనిత, ప్రభ, లక్ష్మికాంతం రామలక్ష్మి, మహేష్ భాస్కరరావు,నయేమి,రాము, నాగమణి,శ్రీను,యన్ ,రాజు వరలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.