Sep 21,2023 13:38

ప్రజాశక్తి - పెనుమంట్ర : గురజాడ వెంకట అప్పారావు జయంతి పొలమూరు హైస్కూల్ లో ఐద్వా ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కేత పద్మజ మాట్లాడుతూ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడ అప్పారావు రచించిన కరుణరసాత్మక గేయం, ఇతివృత్తం కానీ దురాచారం నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్ర సృష్టించి కళాత్మక కావ్యంగా రూపొందించారని సూచించారు. వాడుక భాష కోసం గిడుగు రామ్మూర్తి ఎంతగా ఉద్యమించారో ప్రయోజనాలు ఉంటాయని చెప్పాడని అన్నారు. యోజనాలను వాడుక భాషలో నాటకం కవిత్వం కథలు రాయటం ద్వారా గురజాడ నిరూపించారు. విద్యా విధానంలో మహిళలను గౌరవించడంలో తోటి మనిషిని ప్రేమించడంలో శ్రమను గౌరవించడంలో కులమతాలకు దూరంగా మసలటంలో గురజాడ వెలుగు దారి ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శనీయం అని ఆమె అన్నారు. పొలమూరు జడ్పీహెచ్ స్కూల్  హెచ్ ఎం సరస్వతి చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించారు. ఐద్వా పశ్చిమగోదావరి అధ్యక్షురాలు కేతపద్మజ జిల్లా కమిటీ సభ్యురాలు వల్లెం హేమలత, ఉపాధ్యాయ సిబ్బంది, పిల్లలు గురజాడ అప్పారావు విగ్రహానికి  పూలతో నివాళులు అర్పించారు.