Nov 01,2023 16:07

న్యూఢిల్లీ :  దేశంలో స్థూలవస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్‌టి) ఆదాయంలో అక్టోబర్‌లో గణనీయమైన వృద్ధి నమోదైంది.   గతేడాదితో పోలిస్తే పన్ను వసూళ్లు 13. 4 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. అక్టోబర్‌లో రూ.1.72 లక్షల కోట్లతో రెండో అత్యధిక వసూళ్లుగా నిలిచాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్లతో అత్యధిక జిఎస్‌టి వసూళ్ల రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
డిసెంబర్‌ 2022 నుండి అక్టోబర్‌ వృద్ధిలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. సెప్టెంబర్‌లో పరోక్ష పన్నుల వసూళ్లు 10.2 శాతం క్షీణించడంతో 27 నెలల కనిష్టానికి పడిపోయింది. దేశీయ లావాదేవీలు మరియు సేవల దిగుమతులు అక్టోబర్‌లో 13 శాతం వృద్ధిని సాధించాయి. వస్తువుల దిగుమతుల వృద్ధిని ఆర్థిక శాఖ ఇంకా ప్రకటించలేదు.